Vijayawada MP Kesineni Nani in his latest tweet ultimatum for Chandra babu that he is ready for resign Mp and for party. He asked Chandra babu to control pet dog.
#mpkesineninani
#devineniuma
#vijayawadamp
#tdp
#chandrababu
#buddhavenkanna
తాజా ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన నాటి నుండి కేశినేని నాని ట్వీట్ల ద్వారా పార్టీలో సంచలనం గా మారారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను లక్ష్యంగా చేసుకొని తన అసంతృప్తిని వెల్లగక్కుతున్నట్లుగా స్పష్టం అయింది. ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకొని నానితో మాట్లాడారు. వేడి తగ్గినట్లే తగ్గి..మరోసారి ట్వీట్ల యుద్దం ప్రారంభ మైంది. అందులో భాగంగా.. కొద్ది రోజులు క్రితం పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్, ‘నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్ చేశారు. గత ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం పైన నాని ప్రతిపాదనకు బుద్దా వెంకన్న అడ్డు చెప్పారు. అప్పటి నుండి నడుస్తున్న కోల్డ్ వార్ ఇక ఇప్పుడు ట్వీట్ల యుద్దంగా మారి పార్టీ అధినేత చంద్రబాబునే ఇరకాటంలో పెట్టే స్థాయికి చేరింది.